తిరుపతి కలెక్టరేట్ ఆవరణలో దంపతుల ఆత్మహత్యాయత్నకు యత్నించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు యత్నించిన దంపతులకు ప్రస్తుతం రుయా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.
తిరుపతి కలెక్టరేట్ ఆవరణలో దంపతుల ఆత్మహత్యాయత్నకు యత్నించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట సాయినగర్‌కుచెందిన నాగార్జున, భవాని దంపతులు.. పాసు పుస్తకాల జారీలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నేడు తిరుపతి కలెక్టరేట్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని రుయా ఆస్పత్రికి తరలించారు.
అయితే వారిలో నాగార్జున పరిస్థి విషమంగా ఉంది. భవాని పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారికి రుయా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
