ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో బాంబు పేలుళ్లు సంభవించాయి. పిల్లలు ఆడుకుంటండగా నాటు బాంబులు పేలడంతో ఇద్దరు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ఈ పేలుళ్లపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే గ్రామంలో ఆరు హత్యలు జరగడమే అందుకు కారణం. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రత్యర్ధుల మధ్య విభేదాలు రావడంతో పల్నాడులో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

పల్నాడులో ఇంకా నాటు బాంబులు తయారవుతున్నాయని.. ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్న అనుమానం సర్వత్రా కలుగుతోంది. తొలుత దీపావళి టపాసు పేలిందని భావించినప్పటికీ.. పేలుడు తీవ్రత దృష్ట్యా ఇది నాటు బాంబుగానే పోలీసులు భావిస్తున్నారు.