తిరుపతి లోకసభ స్థానంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం సాధించారు. తిరుపతిలో చంద్రబాబు విస్తృత ప్రచారం గానీ, వ్యూహం గానీ పనిచేయలేదు. తిరుపతిలో బిజెపికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇమేజ్ పనికి రాలేదు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2 లక్ష 35 వేల 798 ఓట్ల మెజారిటీ సాధించారు.

వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2 లక్షల 31 వేలకు పైగా మెజారిటీని సాధించారు.  వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యం తిరుపతిలో 2 లక్షల 25 వేల 773కు చేరుకుంది.

తిరుపతి లోకసభ స్థానంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నారు. ఆయన ప్రస్తుతం 2 లక్ష 24 వేల 157 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మెజారిటీ తిరుపతిలో 2 లక్షల 17 వేలు దాటింది. ఆయన పనబాక లక్ష్మిపై 2 లక్షల 17 వేల 12 ఆధిక్యంలో ఉన్నారు.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మెజారిటీ లక్షా 90 వేలు దాటింది. ఆయన ప్రస్తుతం లక్షా 90 వేల 781 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 

వైసీపి అభ్యర్థి గురుమూర్తి తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో లక్షా 70 వేల 540 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ప్రస్తుతం గురుమూర్తి పనబాక లక్ష్మిపై లక్షా 78 వేల 188 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

తిరుపతి లోకసభ స్థానంలో వైసీపీ అభ్యర్థి తిరుగులేని విజయం దిశగా సాగుతున్నారు. పనబాక లక్ష్మిపై ఆయన లక్షా 37,539 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

తిరుపతి లోకసభ నియోజకవర్గంలో గురుమూర్తి పనబాక లక్ష్మిపై లక్షా 20 వేల 91 వేల ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ప్రస్తుతం లక్షా 30 వేల 799 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మెజారిటీ లక్ష ఓట్లు దాటింది. ఆయన ప్రస్తుతం లక్షా 735 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

గురుమూర్తి మెజారిటీ లక్షకు చేరువైంది. ప్రస్తుతం ఆయన 98,464 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి మెజారిటీ 95 వేలు దాటింది. ఆయన ప్రస్తుతం 95,811 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి లోకసభ ఎన్నికలో 94 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయన పనబాక లక్ష్మిపై 94,307 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 90 వేలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయన పనబాక లక్ష్మిపై 90821 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పనబాక లక్ష్మిపై 84091 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మెజారిటీ 80 వేల ఓట్లు దాటింది. పనబాక లక్ష్మిపై ఆయన 80,138 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 76 వేలకుపైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయన టీడీపీ అభ్యర్థిపై 76.202 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.  ఇంతకు ముందు 72 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగారు.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి రౌండు రౌండుకూ దూసుుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన 69 వేలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయనకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 69274 ఓట్ల మెజారిటీ లభించింది.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 61 వేలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయన పనబాక లక్ష్మిపై 61,296 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 57 వేలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మీద 57,929 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 50 వేలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆయనకు 50,524 ఓట్ల ఆధిక్యం లభించింది.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు 42 వేలకు పైగా మెజారిటీ ఉంది. గురుమూర్తి 42,208 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తిరుపతిలో గురుమూర్తి 32,397 ఓట్ల ఆధిక్యంలో పనబాక లక్ష్మిపై కొనసాగుతున్నారు.

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిన తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 29 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 13991 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తన సమీప అభ్యర్థిపై 2500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

తిరుపతి లోకసభ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.

తిరుపతి లోకసభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెసు అభ్యర్థిగా గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేశారు. బిజెపి, జనసేన కూటమి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేశారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి కారణంగా తిరుపతి లోకసభకు ఎన్నిక జరిగింది.

కోవిడ్ కారణంగా విక్టరీ ర్యాలీలను ఎన్నికల సంఘం నిషేధించింది. తిరుపతి అర్భన్ లో 144వ సెక్షన్ విధించారు. తిరుపతిలో 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.