అమరావతి: మక్కా మసీదు యాత్రకు వెళ్లి వార్చిన వారికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వారంతా విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన వ్యక్తులు. కరోనా లక్షణాలున్న వ్యక్తులు 12మంది వచ్చినట్లుగా తెలుస్తోంది.అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

కరోనా ప్రభావిత దేశాల నుంచి విజయవాడ, గుంటూరు వచ్చిన వారు కనిపించడం లేదు. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వారందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో కొంతమందిని గుర్తించారు.వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

also Read: వరంగల్ విద్యార్థికి ఊరట: కరోనా వైరస్ నెగెటివ్

ఇదిలావుంటే, భారత్ లో కరోనావైరస్ కారణంగా రెండో మరణం సంభవించింది. కోవిడ్ 19 బారిన పడిన 68 ఏళ్ల మహిళ ఢిల్లీలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. గత నెలలో స్విట్జర్లాండ్, ఇటలీ దేశాలకు వెళ్లి వచ్చిన కుమారుడి ద్వారా ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. 

కరోనా వైరస్ కారణంగా గురువారం తొలి మరణం సంభవించింది. కర్ణాటకలో 76 ఏళ్ల వ్యక్తి మరణించాడు. సౌదీ అరేబియా నుంచి ఫిబ్రవరి 29వ తేదీన వచ్చిన కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. భారతదేశంలో కరోనా వైరస్ మరింత విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

Also Read: కరోనా భయం: ఇన్ఫోసిస్ కార్యాలయ భవనం ఖాళీ

దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 82కు చేరుకుంది.  ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారంనాడు ఢిల్లీ, కర్ణాటక, మహరాష్ట్రల్లో కొత్తగా 13 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురంలో తాజాగా ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.