అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరళా నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 793 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందినవారిలో 706 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 81 మందికి కరోనా వైరస్ నిర్దారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఆరుగురు కరోనా వైరస్ బారిన పడ్డారు. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 13,891 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో కరోనా బారిన పడి 11 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో ఐదుగురు మరణించారు. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి మరణించారు. విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరేసి మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కోవిడ్ -19 వ్యాధి మరణాల సంఖ్య 180కి చేరుకుంది. 

గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 96, చిత్తూరు జిల్లాలో 56, తూర్పు గోదావరి జిల్లాలో 72, గుంట్ూరు జిల్లాలో 98, కడప జిల్లాలో 71, కృష్ణా జిల్లాలో 52 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కర్నూలు జిల్లాలో 86, నెల్లూరు జిల్లాలో 24, ప్రకాశం జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 

విశాఖపట్నం జిల్లాలో 11, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 113 కేసులు నమోదయ్యాయి. తద్వారా రాష్ట్రానికి చెందినవారిలో మొత్తం ఇప్పటి వరకు 11554 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1946 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో 391 మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు

అనంతపురం 1467, మరణాలు 7
చిత్తూరు 947, మరణాలు 6
తూర్పు గోదావరి 1074, మరణాలు 7
గుంటూరు 1271, మరణాలు 17
కడప 865, మరణాలు 1
కృష్ణా 1383, మరణాలు 60
కర్నూలు 1873, మరణాలు 63
నెల్లూరు 603, మరణాలు 6
ప్రకాశం 339, మరణాలు 2
శ్రీకాకుళం 62, మరణాలు 2
విశాఖపట్నం 516, మరణాలు 3
విజయనగరం 146, మరణాలు 2
పశ్చిమ గోదావరి 988, మరణాలు 4