ఏపీలో 20 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు: 239 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 20 వేల మార్కు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 239 మంది కోవిడ్ -19తో మరణించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 1322 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీ స్థానికులకు 1263 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 56 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ముగ్గురికి కోవిడ్ -19 ఉన్నట్లు నిర్ధారణ అయింది.
కరోనా వైరస్ వ్యాధితో గత 24 గంటల్లో ఏడుగురు మరణించారు. ఇందులో ఇద్దరు శ్రీకాకుళం జిల్లాలో మరణించారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 239కి చేరుకుంది.
గత 24 గంటల్లో 16,712 శాంపిల్స్ ను పరీక్షించగా రాష్ట్రానికి చెందినవారిలో 1263 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. 424 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,33,852 శాంపిల్స్ పరీక్షించారు. ఇంకా 10,860 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అనంతపురం, చిత్ూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో గత 24 గంటల్లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 142, చిత్తూరు జిల్లాలో 120, తూర్పు గోదావరి జిల్లాలో 171, గుంటూరు జిల్లాలో 197, కడప జిల్లాలో 96 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కృష్ణా జిల్లాలో 55, కర్నూలు జిల్లాలో 136, నెల్లూరు జిల్లాలో 41, ప్రకాశం జిల్లాలో 38, శ్రీకాకుళం జిల్లాలో 36, విశాఖపట్నం జిల్లాలో 101, విజయనగరం జిల్లాలో 24, పశ్చిమ గోదావరి జిల్లాలో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు 2235 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరణాలు మాత్రం సంభవించలేదు. విదేశాల నుంచి వచ్చినవారిలో 419 మందికి కరోనా వైరస్ సోకింది.
ఏపీలో జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు
అనంతపురం 1359, మరణాలు 13
చిత్తూరు 1444, మరణాలు 13
తూర్పు గోదావరి 1778, మరణాలు 8
గుంటూరు 2024, మరణాలు 20
కడప 1341, మరణాలు 4
కృష్ణా 1798, మరణాలు 70
కర్నూలు 2587, మరణాలు 81
నెల్లూరు 771, మరణాలు 6
ప్రకాశం 738, మరణాలు 2
శ్రీకాకళం 225, మరణాలు 8
విశాఖపట్నం 822, మరణాలు 7
విజయనగరం 239, మరణాలు 3
పశ్చిమ గోదావరి 1270, మరణాలు 4