అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజుకు పది వేలకు దాటకుండా కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10,080 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 17 వేల 040 కు చేరుకుంది. 

గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 976, చిత్తూరు జిల్లాలో 963, తూర్పు గోదావరి జిల్లాలో 1310, గుంటూరు జిల్లాలో 601, కడప జిల్లాలో 525, కృష్ణా జిల్లాలో 391, కర్నూలు జిల్లాలో 1353, నెల్లూరు జిల్లాలో 878, ప్రకాశం జిల్లాలో 512, శ్రీకాకుళం జిల్లాలో 442, విశాఖపట్నం జిల్లాలో 998, విజయనగరం జిల్లాలో 450, పశ్చిమ గోదావరి జిల్లాలో 681 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

కాగా, గత 24 గంటల్లో ఏపీలో 97 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1939కి చేరుకుంది.  గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 14 మంది, అనంతపురం జిల్లాలో 11 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదేసి మంది మరణించారు. 
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున చనిపోయారు. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున చనిపోయారు. కృష్ణా జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఇద్దరు మరణించారు. 

ఏపీలో జిల్లాలవారీగా నమోదైన మొత్తం కేసులు, మరణాలు

అనంతపురం 23249, మరణాలు 162
చిత్తూరు 16249, మరణాలు 161
తూర్పు గోదావరి 30160, మరణాలు 218
గుంటూరు 20837, మరణాలు 211
కడప 12614, మరణాలు 63
కృష్ణా 9853, మరమాలు 208
కర్నూలు 26032, మరణాలు 238
నెల్లూరు 12524, మరణాలు 91
ప్రకాశం 8105, మరణాలు 100
శ్రీకాకుళం 10527, మరణాలు 114
విశాఖపట్నం 18532, మరణాలు157
విజయనగరం 8448, మరణాలు 80
పశ్చిమ గోదావరి 17015, మరణాలు 136