అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో పెద్ద యెత్తున కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో గత 24 గంటల్లో 845 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందినవారిలో 812 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 29 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురు కరోనా వైరస్ బారిన పడ్డారు.

తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 16 వేలు దాటింది. మొత్తం 16097 కేసులు నమోదయ్యాయి. కాగా, మరణాలు 200కు చేరువయ్యాయి. మొత్తం కరోనా వైరస్ మరణాల సంఖ్య 198కి చేరుకుంది. తాజాగా ఐదుగురు కరోనా వైరస్ తో మరణించారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో ఒక్కరేసి మరణించారు. 

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా ఈ జిల్లాలో 134 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 47, తూర్పు గోదావరి జిల్లాలో 122, గుంటూరు 104, కడప జిల్లాలో 101, కృష్ణా జిల్లాలో 75, కర్నూలు జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయి. 

నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 79 కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో కేసులు నమోదు కావడం లేదు. తాజాగా కూడా ఏ విధమైన కేసులు రికార్డు కాలేదు. విశాఖపట్నం జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 13, పశ్చిమ గోదావరి జిల్లాలో 53 కేసులు నమోదయ్యాయి. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు 2065 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మొత్తం 407 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

జిల్లాలవారీగా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు

అనంతపురం 1823, మరణాలు 9
చిత్తూరు 1136, మరణాలు 6
తూర్పు గోదావరి 1331, మరణాలు 7
గుం్టూరు 1530, మరణాలు 19
కడప 1101, మరణాలు 1
కృష్ణా 1594, మరణాలు 67
కర్నూలు 2120, మరణాలు 69
నెల్లూరు 643, 6
ప్రకాశం 477, మరణాలు 2
శ్రీకాకుళం 63, మరణాలు 3
విశాఖపట్నం 570, మరణాలు 3
విజయనగరం 174, మరణాలు 2
పశ్చిమ గోదావరి 1063, మరణాలు 4