ఏపీలో కరోనా రికార్డు: ఒక్క రోజులో 5 వేలకు చేరువలో కేసులు, 62 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ జడలు విరబోసి నర్తిస్తోంది. ఒక్క రోజలోనే ఏపీలో ఐదు వేలకు చేరువలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో కొత్తగా 62 మరణాలు సంభవించాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ జడలు విరబోసి నర్తిస్తోంది. నానాటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా ఏపీలో 4,994 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 62 కోవిడ్ -19 మరణాలు సంభవించాయి.
కొత్త కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 58,668 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 758కి చేరుకుంది. గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 458, చిత్తూరు జిల్లాలో 560, తూర్పు గోదావరి జిల్లాలో 524, గుంటూరు జిల్లాలో 577, కడప జిల్లాలో 322 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 424, కర్నూలు జిల్లాలో 515, నెల్లూరు జిల్లాలో 197, ప్రకాశం జిల్లాలో 171, శ్రీకాకుళం జిల్లాలో 133, విశాఖపట్నం జిల్లాలో 230, విజయనగరం జిల్లాలో 210, పశ్చిమ గోదావరి జిల్లాలో 623 కేసులు రికార్డయ్యాయి.
గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో పది మంది, విశాఖపట్నం జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురి చొప్పున, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురేసి, కర్నూలు జిల్లాలో నలుగురు కరోనా వైరస్ కారణంగా మరణించారు కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కరేసి మృత్యువాత పడ్డారు.
ఏపీలో జిల్లాలవారీగా నమోదైన మొత్తం కరోనా కేసులు, మరణాలు
అనంతపురం 5941, మరణాలు 80
చిత్తూరు 560, మరణాలు 59
తూర్పు గోదావరి 7756, మరణాలు 75
గుంటూరు 6071, మరణాలు 63
కడప 3120, మరణాలు 27
కృష్ణా 4101, మరణాలు 108
కర్నూలు 7119, మరణాలు 130
నెల్లూరు 2683, మరణాలు 21
ప్రకాశం 2256, మరణాలు 39
శ్రీకాకుళం 2963, మరణాలు 36
విశాఖపట్నం 2430, మరణాలు 51
విజయనగరం 1696, మరణాలు 19
విశాఖపట్నం 2430, మరణాలు 51
విజయనగరం 1696, మరణాలు 19
పశ్చిమ గోదావరి 4314, మరణాలు 50