Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరులో కరోనా దెబ్బ.. మొన్న కోయంబేడు, నిన్న అజ్మీర్

ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్‌ సోకిన వారంతా కోలుకునే సమయంలో చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధాలు ఉన్నవారి ద్వారా మళ్లీ జిల్లాలో బాధితుల సంఖ్య పెరిగింది.

coronavirus cases raises in Chittoor
Author
Hyderabad, First Published May 16, 2020, 8:35 AM IST

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో దీని ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోయంబేడు నుంచి వచ్చిన వారి నుంచి 14 మందికి కరోనా సోకగా... అజ్మీర్ నుంచి వచ్చిన వలస కూలీల్లో 11మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని అధికారులు ప్రకటించారు.

దీంతో జిల్లావ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 165కి చేరింది. అందులో ఆస్పత్రిలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి చేరిన వారు 77 మంది ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్‌ సోకిన వారంతా కోలుకునే సమయంలో చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధాలు ఉన్నవారి ద్వారా మళ్లీ జిల్లాలో బాధితుల సంఖ్య పెరిగింది. తాజాగా  అజ్మీర్‌‌ నుంచి జిల్లాకు చేరుకున్న వారికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిలో కొందరికి పాజిటివ్‌ వచ్చినట్టు తేలింది.

ఇదిలా ఉంటే కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారితో సంబంధాలున్న వారిని గుర్తించడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చాలామందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపింది. మరోవైపు  అజ్మీర్‌ నుంచి వచ్చిన వారంతా ఎవరినీ కలవకుండా అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు పంపి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios