ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల్లో గత 24 గంటల్లో కరోనా వైరస్ విలయతాండం చేసింది. ఈ రెండు జిల్లాల్లోనే వేయికి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 38 వేలు దాటింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ కరోనా వైరస్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 38 వేలు దాటగా, మరణాలు 500కు చేరువయ్యాయి. కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో కరోనా విలయతాండం చేస్తోంది. రెండు జిల్లాల్లోనే గత 24 గంటల్లో వేయికి పైగా కేసులు నమోదయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,593 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య 38,044కు చేరుకుంది. ఏపీకి చెందినవారిలో గత 24 గంటల్లో 2584 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 9 మందికి కోవిడ్ -19 సోకింది. 

తాజాగా ఏపీలో గత 24 గంటల్లో 40 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య492కు చేరుకుంది. గత 24 గంటల్లో తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మరణించారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు మరణించారు. అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరేసి చనిపోయారు. 

గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 174, తూర్పు గోదావరి జిల్లాలో 500, గుంటూరు జిల్లాలో 139 కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 126, కృష్ణా జిల్లాలో 132, కర్నూలు జిల్లాలో 590, నెల్లూరు జిల్లాలో 125 కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లాలో 104, శ్రీకాకుళం జిల్లాలో 111, విశాఖపట్నం జిల్లాలో 84, విజయనగరం జిల్లాలో 101, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 195 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో మొత్తం ఇప్పటి వరకు 2453 కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చినవారిలో 432 మందికి కరోనా వైరస్ సోకింది. 

జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య

అనంతపురం 3987, మరణాలు 52
చిత్తూరు 3536, మరణాలు 38
తూర్పు గోదావరి 3862, మరణాలు 29
గుంటూరు 3963, మరణాలు 35
కడప 2220, మరణాలు 18
కృష్ణా 2984, మరణాలు 84
కర్నూలు 4816, మరణాలు 114
నెల్లూరు 1590, మరణాలు 16
ప్రకాశం 1395, మరణాలు 21
శ్రీకాకుళం 1703, మరణాలు 16
విశాఖపట్నం 1693, మరణాలు 25
విజయనగరం 982, మరణాలు 11
పశ్చిమ గోదావరి 2428, మరణాలు 32

Scroll to load tweet…