కంటికి కనిపించని ఓ చిన్న సూక్ష్మజీవి మనిషి జీవితాన్ని పూర్తిగా మంచింది. మానవాళి అంతా కరోనాకు ముందు.. కరోనా తర్వాత అన్నట్లుగా పరిస్ధితి మార్చేసింది. వైరస్ చైన్‌ను కట్ చేసేందుకు ప్రపంచ దేశాలు అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ఇవాళ కాకపోయినా రేపైనా దీనిని ఎత్తివేయాల్సిందే.

దీంతో లాక్‌డౌన్ అనంతరం అమలు చేయాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ప్రజా రవాణా విషయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లేదంటే వైరస్ బారినపడాల్సిందే.

Also Read:కరోనా ఎఫెక్ట్: దేవాలయాల్లోకి భక్తుల అనుమతులపై దేవాదాయ శాఖ మార్గదర్శకాలు జారీ

భారతదేశంలోనూ గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా వివిధ ప్రాంతాలను విభజిస్తూ.. ప్రభుత్వం కొన్ని మినహాయింపులను కల్పించింది. ఏపీ ప్రభుత్వం బస్సులను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది.

అయితే సామాజిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని తయారుచేశారు. బస్సుల్లోని ప్యాసింజర్ సీట్ల సంఖ్యను తగ్గించి 26కి పరిమితం చేశారు. ఇందుకు  సంబంధించి కొత్త బస్సులకు సంబంధించిన డిజైన్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదముద్ర కోసం పంపారు.

Also Read:కోయంబేడ్ దెబ్బ: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

కాగా త్వరలోనే ప్రజా రవాణాను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక  బస్సులను డిజైన్ చేసింది.

ఈ మేరకు ఈ నెల 18 నాటికి 100 బస్సులు సిద్ధంగా ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ బస్సులన్నీ వాటి సామర్ధ్యం కంటే 70 శాతం తక్కువ ప్రయాణీకులను తీసుకెళ్తాయి.