Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాకు కరోనా వ్యాక్సిన్... అందించే ఆస్పత్రుల వివరాలివే

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశవ్యాప్తంగా ఎంపికచేసిన ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కూడా వున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. 

corona vaccination trial process starts december 28,29: collector
Author
Vijayawada, First Published Dec 25, 2020, 4:10 PM IST

విజయవాడ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ పంపిణీకి దేశవ్యాప్తంగా ఎంపికచేసిన ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కూడా వున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాను ఎంపిక చేసిందని అధికారుల సమావేశంలో చెప్పారు. 

ఈ క్రమంలో జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు 5 హాస్పిటల్స్ మోడల్ గా గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ వైద్యశాల, ప్రకాష్ నగర్ అర్బన్ హెల్త్ కేర్
సెంటర్, నగరంలో ఓ ప్రైవేటు వైద్యశాల, ఉప్పలూరు పిహెచ్‌పి ఎంపిక చేశారు. 29,30 తేదీల్లో ట్రయిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

మరోవైపు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న స్ట్రెయిన్ 70 భారతదేశంలోకి రాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఇప్పటికే మార్పు చెందిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలోకి ప్రవేశించినట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూకే నుంచి భారత్‌కు వచ్చిన కొందరికి పాజిటివ్‌గా తేలడంతో దేశంలో మరోసారి లాక్‌డౌన్ తప్పదేమోనన్న చర్చ మొదలైంది. తాజాగా కృష్ణా జిల్లాల్లో స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి జిల్లాకు 116 మంది వచ్చినట్టు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 300 బెడ్లు ఏర్పాటు చేశారు.  150 కోవిడ్.. మరో 150 నాన్ -కోవిడ్ బెడ్లను ఏర్పాటు చేశారు.

యూకే నుంచి వచ్చిన వారి కోసం వీటిని ఏర్పాటు చేశారు. పరీక్షల అనంతరం పరిశీలించి ప్రత్యేక విభాగాల ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లకు, ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి మచిలీపట్నానికి చేరుకున్న వారి వివరాలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా గూడవల్లి క్వారంటైన్ సెంటర్‌తో పాటు ఈడ్పుగల్లులో గతంలో వున్న క్వారంటైన్ సెంటర్‌ను సైతం పున: ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios