Asianet News TeluguAsianet News Telugu

కరోనా నియంత్రణకు శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు.. నేటినుంచే అమల్లోకి..

మంగళవారం నుంచి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో తీసుకోవాలని భక్తులకు సూచించారు. శీఘ్ర, అతిశీఘ్ర దర్శన టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు covid vaccination ధ్రువపత్రం తప్పనిసరి అని ఈవో లవన్న స్పష్టం చేశారు.

corona restictions in srisailam temple from today onwards
Author
Hyderabad, First Published Jan 17, 2022, 10:37 AM IST

శ్రీశైలం : Corona diffusion నేపథ్యంలో Srisailam దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు EO Lavanna వెల్లడించారు. అన్నప్రసాద వితరణ, పుణ్యస్నానాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వామివారికి రోజుకు 4 సార్లు సామూహిక అభిషేకాలు జరుగుతాయని స్పష్టం చేశారు.

మంగళవారం నుంచి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో తీసుకోవాలని భక్తులకు సూచించారు. శీఘ్ర, అతిశీఘ్ర దర్శన టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు covid vaccination ధ్రువపత్రం తప్పనిసరి అని ఈవో లవన్న స్పష్టం చేశారు.

corona దృష్ట్యా Srisailam ఆలయంలో నేటినుంచి ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి స్వామివారి సర్వదర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అన్నప్రసాదం, వేదాశీర్వచనం, పుణ్యస్నానాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. devotees ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని కోరారు.

ప్రస్తుతం లఘు దర్శనం మాత్రమే కలిపిస్తున్నామని ఈవో Lavanna చెప్పారు. శఠారి, తీర్థం, ఉచిత ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నామని చెప్పారు. గంటకు కేవలం వెయ్యి మంది భక్తుకు మాత్రమే  దర్శనం కల్పించనున్నామన్నారు. పరిమిత సంఖ్యలోనే ఆర్జిత సేవలు జరుగుతాయని ఈవో తెలిపారు. అందుబాటులో ఉన్న ఆర్జిత సేవల్లో ప్రస్తుతం జారీ చేస్తున్న టికెట్లలో 50 శాతం టికెట్లను మాత్రమే విక్రయించనున్నట్టుగా ఈవో వివరించారు. 

ఈ నెల 18 నుండి ఆర్జిత సేవా టికెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తామని ప్రకటించారు ఈవో. Online Registration  సమయంలో కరోనా Vaccination వివరాలను నమోదు చేయాలని ఆయన భక్తులకు సూచించారు. సామూహిక ఆర్జిత అభిషేకాలు రోజుకు నాలుగు విడుతలుగా నిర్వహించనున్నట్టుగా ఈవో చెప్పారు. ఒక్కో విడతలో 75 టికెట్లు జారీ చేస్తామన్నారు. టికెట్ల  తీసుకున్న భక్తులకు కేవలం స్వామివారి దర్శనం కల్పిస్తామని ఈవో చెప్పారు. 

కరోనా నేపథ్యంలో వృద్దులు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు పదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు ఆలయానికి రావొద్దని ఈఓ సూచించారు. తమకు కేటాయించిన సమయానికే ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులు రావాలని ఈవో కోరారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న బక్తులను క్యూ లైన్లలో అనుమంతించబోమని ఈవో వివరించారు. క్యూ లైన్లలో ప్రవేశించే ముందు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరన్నారు.

శ్రీశైలంలో ఎక్కువ రోజులు ఉండకూడదని భక్తులకు ఈవో సూచించారు. సాతాళగంగలో స్నానాలను కూడా నిలిపివేస్తున్నామని ఈవో చెప్పారు. రోప్‌వే, బోటింగ్ సైతం కూడా నిలిపివేసినట్టుగా ఆయన వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios