ఏలూరు:  కరోనా భయంతో యువకుడు ఐశ్వర్య రాజు బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కరోనా రావడంతో ఆయన డిప్రెషన్ కు గురయ్యాడు. హోం ఐసోలేషన్ లోనే ఆయన చికిత్స తీసుకొంటున్నాడు. ఐశ్వర్యరాజు తల్లీదండ్రులకు కూడ కరోనా సోకింది. వారిద్దరూ కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఒకే కుటుంబంలో ముగ్గురు కరోనాతో చికిత్స తీసుకొంటున్నారు. తల్లీదండ్రులకు కరోనా సోకింది. తాను కూడ కరోనాతో చికిత్స తీసుకొంటున్నాడు ఐశ్వర్యరాజు. ఈ సమయంలో ఆయన డిప్రెషన్ కు గురయ్యాడు. హోం ఐసోలేషన్ లో ఉన్న ఐశ్వర్యరాజు బుధవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నట్టుగా పోలీసులు తెలిపారు.

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో మంగళవారానికి కరోనా కేసులు 2 లక్షల 44 వేల 549కి చేరుకొన్నాయి. మంగళవారం నాడు 9,024 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఒక్క రోజులోనే 87 మంది కరోనాతో చనిపోయారు. మంగళవారంనాడు ఒక్క రోజులోనే 678 కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.కరోనా సోకిన రోోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రులను కూడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.