సత్తెనపల్లిలో చనిపోయిన గౌస్ ముందునుండి గుండె జబ్బుతో బాధపడేవాడని ఐజీ ప్రభాకర్ రావు తెలిపారు. అయితే లాక్ డౌన్ కొనసాగుతున్నా అతడు బయటకు రావడంతో  పోలీసులు అతన్ని ప్రశ్నించారని...అయితే అందుకు అతడు సరయిన సమాధానం చెప్పలేకపోయాడని అన్నారు. దీంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించగా భయంతో కుప్పకూలిపోయాడని తెలిపారు. 

అయితే పోలీసుల దాడిలో అతడు మృతిచెందాడని ప్రచారం జరుగుతోందని... దీనిపై నిజానిజాలను తేల్చి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ తెలిపారు. ఈ ఘటనపై శాఖపరమైన విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే గౌస్ ను బెదిరించిన స్థానిక ఎస్సై రమేష్ పై వేటు పడింది. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది.