Asianet News TeluguAsianet News Telugu

ఇదీ దుస్థితి... మార్చురీలో గుట్టలుగా పేరుకుపోతున్న కరోనా మృతదేహాలు

కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ప్యాక్ చేసేందుకు బాడీ బ్యాగ్స్ కొరత ఏర్పడింది. 

corona dead bodies in machilipatnam govt hospital akp
Author
Machilipatnam, First Published Apr 30, 2021, 4:34 PM IST

మచిలీపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి బారినపడి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఇలా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా కరోనా మరణాలు పెరుగుతున్నాయి. దీంతో మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహాలను ప్యాక్ చేసేందుకు బాడీ బ్యాగ్స్ కొరత ఏర్పడింది. దీంతో కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. 

బాడీ బ్యాగ్స్ కొరతలో జిల్లా ఆస్పత్రిలో కరోన మృతదేహాలను భద్ర పరిచేందుకు సిబ్బంది అవస్థలు పడుతున్నారు. బాడీ బ్యాగ్స్ లేకపోవడంతో మృతదేహాలను అలాగే వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఆలా ప్రభుత్వాస్పత్రి మార్చురీలో రోజురోజుకీ  కరోనా మృతదేహాలు పేరుకుపోతున్నాయి. 

read more  నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం..

ఇక కలియుగ ప్రత్యక్ష దైవం వెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానంలలోనూ కరోనా కల్లోలం రేగింది. టీటీడీ ఉద్యోగులపై కరోనా పంజా విసురుతోంది. ఇవాళ (శుక్రవారం) ఒక్కరోజే కరోనాతో ముగ్గురు టిటిడి ఉద్యోగులు మృతి చెందారు. దీంతో కరోనాతో మరణించిన ఉద్యోగుల సంఖ్య 15 మంది మరణించారు. అన్నదానం డిప్యూటీ ఈవోతో పాటు మరో ఇద్దరు ఇవాళ కరోనాతో మృతి చెందారు.

గత ఏడాది కూడ కరోనాతో టీటీడీలో పలువురు మరణించారు. గత ఏదాది ఆగష్టు మాసంలో కరోనాతో 743 మంది బాదపడ్డారు. వీరిలో 402 మంది కరోనా నుండి కోలుకొన్నారు. గత ఏడాదిలో ప్రముఖ అర్చకులు కూడ కరోనా కారణంగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది కరోనా కేసులు పెరగకుండా టీటీడీ పాలకవర్గం, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా  అధికారులు ప్రకటించారు. వ్యాపారులు కూడ  మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పలు పట్టణాల్లో మినీ లాక్‌డౌన్ ను విధించారు.కడప, శ్రీకాకుళం జిల్లాల్లో కూడ  మినీ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  చర్యలు తీసుకొంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios