Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం... మరో 13మంది ఖైదీలకు పాజిటివ్

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికే 9మంది ఖైధీలు కరోనా వైరస్ బారిన పడగా తాజాగా మరో 13మందికి కూడా పాజిటివ్ గా తేలింది. 

corona cases increased in rajahmundry central jail akp
Author
Rajahmundry, First Published Apr 9, 2021, 9:43 AM IST

రాజమండ్రి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి తిరిగి వేగంగా విజృంభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా కరోనా కలకలం రేగింది. ఇప్పటికే 9మంది ఖైధీలు ఈ వైరస్ బారిన పడగా తాజాగా మరో 13మందికి కూడా పాజిటివ్ గా తేలింది.  దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు కరోనా సోకిన ఖైధీలను ప్రత్యేకంగా ఓ బ్యారక్ లో క్వారంటైన్ చేశారు. 

జైలులోని ఇతర ఖైదీలు, సిబ్బందికి కరోనా సోకకుండా పోలీస్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే కరోనా సోకినవారికి వైద్యం అందిస్తూనే ఇతర ఖైదీలకు కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు.  

read more   నిండుకున్న వ్యాక్సిన్ డోసులు: రంగంలోకి జగన్, అధికారులకు కీలక ఆదేశాలు

మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో2,558 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 15వేల 832 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మరణించారు. కృష్ణా,కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,268కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,53,33,851 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,268 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో2558 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 915 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 93 వేల 651 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 14,913 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 131, చిత్తూరులో 465,తూర్పుగోదావరిలో 058,గుంటూరులో 399, కడపలో 094,కృష్ణాలో 152, కర్నూల్ లో 344, నెల్లూరులో 204,ప్రకాశంలో 153, శ్రీకాకుళంలో 185, విశాఖపట్టణంలో 290, విజయనగరంలో 046,పశ్చిమగోదావరిలో 037కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -69,031 మరణాలు 606
చిత్తూరు  -92,205,మరణాలు 878
తూర్పుగోదావరి -1,25,587, మరణాలు 637
గుంటూరు  -80,525, మరణాలు 683
కడప  -56,379, మరణాలు 464
కృష్ణా  -51,892,మరణాలు 689
కర్నూల్  -62,497, మరణాలు 499
నెల్లూరు -64,398,మరణాలు 516
ప్రకాశం -63185, మరణాలు 587
శ్రీకాకుళం -47,367,మరణాలు 347
విశాఖపట్టణం  -63,577,మరణాలు 582
విజయనగరం  -41,631, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,663, మరణాలు 542
 

Follow Us:
Download App:
  • android
  • ios