Asianet News TeluguAsianet News Telugu

నిండుకున్న వ్యాక్సిన్ డోసులు: రంగంలోకి జగన్, అధికారులకు కీలక ఆదేశాలు

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్‌కు కొరత ఏర్పడిందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు

ap cm ys jagan review on corona vaccination ksp
Author
amaravathi, First Published Apr 8, 2021, 8:04 PM IST

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్‌కు కొరత ఏర్పడిందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు కార్యక్రమంపై బుధవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ, నివారణ, సంసిద్ధతపై ఆయన ప్రధానంగా చర్చించారు. సగటున 1.4 లక్షల మందికి టీకాలను వేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

Also Read:ఏపీలో కరోనా డేంజర్ బెల్స్: ఒక్క రోజులోనే 2,558 కేసులు

ప్రస్తుతం తగినన్ని డోసులు లేవని.. కేవలం రెండు రోజులకు సరిపడా నిల్వలే అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా టీకాలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మందికి ప్రతి రోజూ టీకాలు వేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి ఆస్కారం ఉండకూడదన్నారు. కొవిడ్‌ రోగులకు రూ.1 ఖర్చు లేకుండా చికిత్స అందించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios