Corona Cases in AP: ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. తాజా కేసులెన్నంటే..?

Corona Cases in AP: ఆంధ్ర ప్ర‌దేశ్‌లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 4,528 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,027 కేసులు నమోదు కాగా... పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 62 కేసులు కేసులు నమోదయ్యాయి.
 

Corona Cases in AP:  4528 New Corona Cases Reported In andhra pradesh

Corona Cases in AP: ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ క‌రోనా కేసులు భారీగా పెరుగు తున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 39,816  పరీక్షలు నిర్వహించగా.. 4,528 మందికి వైరస్ పాజిటివ్ (Corona Cases in AP) గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,96,755 కి చేరాయి. రెండు రోజుల్లోనే 2వేలకుపైగా కొత్త కేసులు పెరిగాయి. వైరస్ వల్ల ఒక్క‌రూ  ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,508 కి చేరింది.  

గ‌డిచిన 24 గంట‌ల్లో కరోనా నుంచి 418 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,934 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 18,313 యాక్టివ్‌ కేసులున్నట్లు (Active Cases in AP) ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా.. చిత్తూర్ లో అత్య‌ధికంగా 1027 కేసులు నమోదు కాగా.. అనంత‌ర‌పూర్ లో  300, తూర్పుగోదావరిలో 327, శ్రీకాకుళంలో 385, గుంటూరు జిల్లాల్లో 377, క‌డ‌ప‌లో 236 కేసులు. కృష్ణ‌లో 166 కేసులు, క‌ర్నులులో 164 కేసులు,  నెల్లూర్‌లో229 కేసులు, విశాఖ‌లో 992 కేసులు, విజ‌య‌నగ‌రంలో 121 కేసులు, వెస్ట్ గోదావ‌రిలో 62 కేసులు న‌మోద‌య్యాయి. ఇలా క‌రోనా విజృంభిస్తుండ‌టంలో  ఈ నెల 18 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. 

అలాగే దేశ‌వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో  2,64,202 కేసులు న‌మోద‌య్యాయి. వైరస్​ కారణంగా మరో 315 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే స‌మ‌యంలో 1,09,345 మంది వ్యాధి బారి​ నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం కరోనా కేసులు 36,582,129 ఉన్నాయని, దేశ‌వ్యాప్తంగా క‌రోనా మర‌ణాల సంఖ్య  4,85,350 చేరింద‌ని వెల్ల‌డించింది ఆరోగ్యశాఖ. అదే స‌మ‌యంలో క‌రోన యాక్టివ్ కేసులు సంఖ్య‌ 12,72,073 కి చేరింద‌నీ, ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం కోలుకున్నవారి సంఖ్య‌ 3,48,24,706 చేరిందని ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్​ ప్ర‌మాద‌కారంగా మారుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం 5,753 ఒమిక్రాన్ కేసులున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలో వ్యాక్సినేష‌న్ ను వేగవంతం చేసింది కేంద్రం.  వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగిస్తుంది. బుధవారం ఒక్కరోజే 73,08,669 డోసులు అందించార‌నీ, ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కు చేరిందని కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ త‌రుణంలో  మాస్కులు ధరించాలని,  భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios