తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు ఎక్కడి నుండి ఎక్కడకు వెళుతున్నా పోలీసులు ఆపేస్తున్నారు. వాహనాల్లో వెళుతున్న వారిని మరీ నిలిపేసి వాళ్ల కులమడుగుతున్నారు.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దెబ్బ ప్రభుత్వంపై బాగానే కనబడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు ఎక్కడి నుండి ఎక్కడకు వెళుతున్నా పోలీసులు ఆపేస్తున్నారు. వాహనాల్లో వెళుతున్న వారిని మరీ నిలిపేసి వాళ్ల కులమడుగుతున్నారు. వాహనాలను ఆపిన పోలీసులు వాహనం ఆర్సీ గానీ లేదా డ్రైవ్ చేస్తున్న వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడగటం లేదట. నేరుగా కులం అదికూడా ‘మీరు కాపులా’ అనే అడుగుతున్నారు. దాంతో జిల్లాలో చాలా చోట్ల సామాన్య జనాల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై చిర్రెత్తుతోంది. ప్రభుత్వ చర్యలు కూడా కాపులను రెచ్చగొట్టేలానే ఉంది. దాంతో మగ, ఆడ అన్న తేడా లేకుండా పోలీసులపై జనాలు రెచ్చిపోయి ఎదురుతిరుగుతున్నారు. మీరే చూడండి వీడియోలో.
Add Asianetnews Telugu as a Preferred Source

