నిజానికి ఈ దేవాలయంలో నిబంధనల ప్రకారం తెల్లవారుజామున ఐదు గంటల తర్వాతనే పూజలు ప్రారంభించాలి. అయితే జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరిన పవన్‌ ఓ గంట ముందుగానే అక్కడికి వచ్చారు. స్వామికి పూజలు చేయాలని అర్చకులను కోరారు.

ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి పూజలపై వివాదం చెలరేగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎ్‌స.జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామికి సోమవారం వేకువ జామున నాలుగు గంటలకు పవన్‌ కల్యాణ్ చేసిన పూజలు వివాదానికి దారితీశాయి. 

నిజానికి ఈ దేవాలయంలో నిబంధనల ప్రకారం తెల్లవారుజామున ఐదు గంటల తర్వాతనే పూజలు ప్రారంభించాలి. అయితే జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరిన పవన్‌ ఓ గంట ముందుగానే అక్కడికి వచ్చారు. స్వామికి పూజలు చేయాలని అర్చకులను కోరారు.

తాను అక్కడికి వస్తున్నట్లు అందరికీ తెలిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. దీంతో అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై దేవస్థానం అధికారులు ప్రధాన అర్చకుడిని వివరణ కోరారు. 
భద్రతా కారణాలు, అభిమానుల తాకిడి వంటి సమస్యలను పవన్‌ చెప్పడంతోనే పూజలు ప్రారంభించామని ప్రధాన అర్చకుడు సూర్యప్రకాశ్‌ వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్త

వేకువ జామున పవన్ కల్యాణ్ రహస్య పూజలు