ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు : మంగళగిరిలో భగ్గుమన్న విభేదాలు.. మురుగుడు పై ముదురుతున్న వివాదం...
ఏ పార్టీలో వున్నాడని తెలియకుండా మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ కేటాయించటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
మంగళగిరి : ‘ఇలా అయితే మంగళగిరిలో వైకాపా తుడుచి పెట్టుకుపోతుందని...’ మురుగుడు ఎమ్మెల్సీ కేటాయింపుపై వైస్సార్సీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరం భగ్గుమన్నారు.
ఏ పార్టీలో వున్నాడని తెలియకుండా మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ కేటాయించటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. పదవులు అనుభవించి కాంగ్రెస్ భూస్తాపితం చేశాడు.. అవినీతి పరుడిని అందలం ఎక్కిస్తారా? ఆస్తులు కాపాడుకోవటానికి పార్టీలు మారే వారిని ప్రోత్సహిస్తారా? అని అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం అన్నారు.
10 ఏళ్ల నుండి పని చేసిన నాయకులు గుర్తుకు రాలేదా? అంటూ YCP అధిష్టానం మీద మంగళగిరి పట్టణ వైకాపా అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు ఆరోపణలు గుప్పించారు.
మంగళగిరి ని దోపిడి చేసిన వ్యక్తికి అధిష్టానం ఎలా MLC ఇస్తారని ప్రశ్నించారు. ఆఫ్కో చైర్మన్ గా అవినీతికి పాల్పడి చేనేతలను నిలువున మోసం చేసిన వ్యక్తి Murugudu hanumantaravu అని అన్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి ఆస్తులు కాపాడుకోవటం కోసం కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడని సంచలన ఆరోపణాలు చేశారు.
కాగా, స్థానిక సంస్థల కోటా ap mlc elections సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్ధుల జాబితాను శుక్రవారం ప్రకటించారు. పదవుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ys jagan mohan reddyదేనని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించామని.. మరో 7 స్థానాలు ఓసీలకు కేటాయించామని సజ్జల వెల్లడించారు.
వైసీపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు వీరే :
ఇందుకూరు రాజు (విజయనగరం)
వరుదు కళ్యాణి (విశాఖ)
వంశీ కృష్ణయాదవ్ (విశాఖ)
అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి)
మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా)
తలశిల రఘురామ్ (కృష్ణా)
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)
మురుగుడు హనుమంతరావు (గుంటూరు)
తూమాటి మాధవరావు (ప్రకాశం)
కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు)
వై శివరామిరెడ్డి (అనంతపురం)
అమరావతి అసైన్డ్ భూముల కేసు.. చంద్రబాబు, నారాయణలకు ఊరట..!
చిలకలూరిపేటకు చెందిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు సుధీర్ఘ నిరీక్షణ తర్వాత పదవి వరించనున్నట్లు ప్రచారం జరిగింది. గత ఎన్నికల సమయంలో చిలకలూరి పేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలవాల్సినప్పటికీ.. చివరి నిమిషంలో అప్పటి టీడీపీ మంత్రి prattipati pullaraoపై బీసీ మహిళగా విడుదల రజనీని బరిలోకి దింపింది. దీంతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పోటీ నుంచి తప్పుకున్న మర్రి రాజశేఖర్‌కు అప్పుడే జగన్ అధికారంలోకి వస్తే మంత్రి వర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కానీ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకు నిరాశే ఎదురైంది. గుంటూరు జిల్లాకు సంబంధించిన రెండు స్థానాల్లో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఇక మరో స్థానంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి, మురుగుడు హనుమంతరావుకు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చింది.