Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ సేవలు అందించిన నర్సులకు మొండిచేయి: ధర్నా వీడియో

కోవిడ్ సేవలు అందించిన కాంట్రాక్టు నర్సులకు మొండి చేయి చూపించి ఇతరులను మెరిట్ లిస్టులో చూపిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాకు దిగారు. కలెక్టర్ కార్యాలయం వద్ద వారు దర్నా చేశారు.

Contract staff nurses dharna in Prakasam district
Author
Ongole, First Published Aug 24, 2020, 11:38 AM IST

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ నర్సుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద వైద్య సిబ్బంది ధర్నాకు దిగారు. అర్హత ఉన్న వైద్య సిబ్బందిని పక్కన పెట్టి ప్రాధాన్యం లేనివారిని మెరిట్ లిస్టులో చూపించారని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. 

అన్ని ఆధారాలు చూపించి ఫిర్ాయదు చేసినప్పటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తు సమయంలో కోవిడ్ సేవలు అందించిన కాంట్రాక్టు ఉద్యోగులకు మొండిచేయి చూపించారని విమర్శించారు. ధర్నా చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు.

"

Follow Us:
Download App:
  • android
  • ios