Asianet News Telugu

కడపలో విషాదం: కంట్రోల్‌రూమ్‌లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య


కడప జిల్లాలోని పోలీస్ కోర్టు ఆవరణలోని పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ విషయమై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

constable Vijay kumar commits suicide in Kadapa district lns
Author
kadapa, First Published Jul 21, 2021, 11:30 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కడప: కడప జిల్లా కోర్టు ఆవరణలోని పోలీస్ కంట్రోల్ రూమ్ లో  విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్  మంగళవారం నాడు రాత్రి  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.బుధవారం నాడు కోర్టు సిబ్బంది  కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.  విజయ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్నాడు. 

ఈ కారణంగానే   విజయ్ కుమార్  ఆత్మహత్య చేసుకొని ఉంటాడని  వన్‌టౌన్ పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios