సారాంశం


కడప నగరంలోని కోఆరేటివ్ నగర్ లో  భార్య,పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్.

కడప: నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో  గురువారంనాడు దారుణం చోటు చేసుకుంది.  భార్య, ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్.  ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కడప పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో  పనిచేసే  వెంకటేశ్వర్లు  ఈ దారుణానికి పాల్పడ్డాడు.

కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ లో వెంకటేశ్వర్లు రైటర్ గా పనిచేస్తున్నాడు. బుధవారంనాడు రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని ఆయన ఇంటికి చేరుకున్నాడు. అయితే గంట తర్వాత  రాత్రి 12 గంటలకు తిరిగి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. స్టేషన్ నుండి తుపాకీని తన వెంట తెచ్చుకున్నాడని సమాచారం.  భార్య, ఇద్దరు పిల్లలను చంపిన తర్వాత తాను కూడ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు.  చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు. ఒకరు డిగ్రీ చదువుతున్నారు. మరొకరు ఇంటర్ చదువుతున్నట్టుగా స్థానికులు చెప్పారు. భార్య, పిల్లలను హత్య చేసిన తర్వాత  వెంకటేశ్వర్లు  ఆత్మహత్య చేసుకున్నాడు.  కానిస్టేబుల్  వెంకటేశ్వర్లు ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ ఘటనపై  పోలీసులు  విచారణ చేస్తున్నారు.  సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ  పరిశీలించారు.