కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ దొడ్డారెడ్డి ప్రసన్న కుమార్ సోమవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. కీలక బాధత్యలు చేపట్టారు.

చిత్తూరు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. 1987లో మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 1989లో అప్పటి మున్సిపల్ వైస్ ఛైర్మన్, దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ పై అవిశ్వాస తీర్మానం నెగ్గి.. ప్రసన్నకుమార్ వైస్ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. తర్వాత క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

అయినప్పటినీ పార్టీ గెలుపు కోసం ఎన్నికల్లో క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఆయనను టీడీపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ నేతలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఇప్పటికి ఆయన అంగీకరించారు. ముహుర్తం కూడా కుదరడంతో.. అమరావతి వెళ్లి ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.