గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయని ఆరోపణ. కోట్ల రూాపాయలు పంచుతున్నారు. ఎన్నికల కమిషన్ కి పిర్యాదుకు సిద్దమైనా కాంగ్రెస్ పార్టి.

 నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ, వైసీపి పార్టీలు అక్ర‌మాల‌కు చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పిర్యాదుకు సిద్ద‌మైంది. గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగిన టీడీపీ, వైసీపి పార్టిల అక్ర‌మాల‌కు దిగుతున్నాయ‌ని ఆరోపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ రేపు ఈసీకి ఫిర్యాదు చేయనుంది.


నంద్యాల ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇరు పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వంద‌ల‌ కోట్ల రూపాయలను పంచుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అక్రమాలకు పాల్పడుతున్నాయనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. రోడ్ల‌పై ప్ర‌చారం పేరుతో టీడీపీ మంత్రులు, వైసీపి నేత‌లు డ‌బ్బులు కుమ్మ‌రిస్తున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు.

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్దికి ఓటేయాలనే నినాదంతో హస్తం పార్టీ నంద్యాలలో ప్రచారం చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌చారానికి కాంగ్రెస్ నాయ‌కులు అక్క‌డ తిష్ట‌వేశారు.