Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు: భరోసా యాత్ర

ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ  కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సిద్దంగా ఉన్న అభ్యర్థుల నుండి  ధరఖాస్తులను స్వీకరించనున్నారు

congress plans bharosa yatra in andhra pradesh soon
Author
Amaravathi, First Published Jan 31, 2019, 4:31 PM IST


విజయవాడ: ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ  కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సిద్దంగా ఉన్న అభ్యర్థుల నుండి  ధరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు గురువారం నాడు విజయవాడలో  సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని  నిర్ణయం తీసుకొంది.  ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న  అభ్యర్థుల నుండి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో  ధరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఈ ధరఖాస్తులను స్కృూట్నీ కమిటీ పరిశీలించిన మీదట అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక  హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.

మరోవైపు రాష్ట్రంలోని 17 చోట్ల భారీ బహిరంగ సభలను నిర్వహించాలని  కూడ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇవాళ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఆయా నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.  కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహరాల ఇంచార్జీ ఉమెన్ చాందీ,  ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios