న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై వివరణ ఇవ్వాలని జల్ శక్తి మంత్రిత్వశాఖను నిలదీశారు. 

ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది జల్ శక్తి మంత్రిత్వ శాఖ. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లు అని స్పష్టం చేసింది. వాటిలో ఇరిగేషన్, వాటర్ సప్లై కోసం రూ.50,987 కోట్లు అని తేల్చి చెప్పింది. విద్యుత్ ప్రాజెక్టు వ్యయం రూ.4,560 కోట్లు అని స్పష్టం చేసింది కేంద్రప్రభుత్వం.