Asianet News TeluguAsianet News Telugu

నాకు, కాంగ్రెస్‌ పార్టీకి మధ్య చిచ్చు పెట్టోద్దు: బాబుపై కేవీపీ విమర్శలు

తనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు సృష్టించవద్దన్నారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని నిర్ణయించి రాజ్యసభలో ఆందోళన నిర్వహించానన్నారు. 

congress mp kvp ramachandra rao comments on chandrababu naidu
Author
Delhi, First Published Feb 13, 2019, 1:09 PM IST

తనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు సృష్టించవద్దన్నారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని నిర్ణయించి రాజ్యసభలో ఆందోళన నిర్వహించానన్నారు.

ఈ క్రమంలో రాజ్యసభలో స్పృహతప్పి పడిపోయానని కేవీపీ గుర్తు చేశారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఫ్లకార్డ్‌ను పట్టుకుని రాజ్యసభలో సంవత్సరాల తరబడి ఒంటరిగా వెల్‌లో నిలబడ్డానన్నారు. ప్రత్యేకహోదాతో పాటు ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందిగా ఆందోళన చేశానని ఈ సమయంలో ఆస్పత్రికి సైతం వెళ్లాల్సి వచ్చిందని రామచంద్రరావు అన్నారు.

పెయిన్ కిల్లర్స్, యాంటిబయోటిక్స్ సైతం తీసుకుని రాజ్యసభలో నిలబడ్డానని. ఆ సమయంలో వచ్చిన వాసనను గమనించిన తోటి సభ్యులు వారించారన్నారు. అప్పుడు తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఒక్కడే పోరాడుతున్నారని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారని రామచంద్రరావు గుర్తు చేశారు. కానీ తన పోరాటాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios