జగన్ మాట మార్చేశారు.. ఉమెన్ చాందీ

congress leader oomen chandy fire on jagan
Highlights

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ కాపులకు అండగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చాందీ తెలిపారు. 

వైసీపీ అధినేత జగన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని మాట మార్చేశారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఊమెన్ చాందీ అన్నారు. కాకినాడ పర్యటన కోసం బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు.

 విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని నాలుగేళ్లుగా చెబుతున్న జగన్‌.. ఇప్పుడు మడమ తిప్పారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ కాపులకు అండగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చాందీ తెలిపారు. 

2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ కీలకపాత్ర పోషించడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదాకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో.. కాపులకూ అంతే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆయన కాకినాడ బయలుదేరి వెళ్లారు.

loader