తిరుపతి బైపోల్స్: కాంగ్రెస్ అభ్యర్ధి చింతామోహన్
తిరుపతి ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా చింతా మోహన్ పోటీ చేయనున్నారు. శుక్రవారం నాడు ఎఐసీసీ చింతామోహన్ పేరును ప్రకటించింది.
తిరుపతి: తిరుపతి ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా చింతా మోహన్ పోటీ చేయనున్నారు. శుక్రవారం నాడు ఎఐసీసీ చింతామోహన్ పేరును ప్రకటించింది.తిరుపతి ఎంపీ స్థానం నుండి ఆరు దఫాలు చింతామోహన్ విజయం సాధించాడు.గత ఏడాది తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి, బీజేపీ అభ్యర్ధిగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రత్నప్రభలు పోటీ చేస్తున్నారు. చింతా మోహన్ ను కాంగ్రెస్ బరిలోకి దింపింది.
ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. ఈ స్థానంలో గెలవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో తమ కూటమి ప్రత్యామ్నాయమని చాటేందుకు ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని బీజేపీ జనసేన కూటమి ప్రయత్నాలు చేస్తోంది.