ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసం సోమనాథన్ కమీషన్ సమావేశమైంది. ఢిల్లీలోని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ప్రారంభమైన ఈ సమావేశానికి ఏపీ నుంచి ఏడు శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత కేంద్ర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసం సోమనాథన్ కమీషన్ సమావేశమైంది. ఢిల్లీలోని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ప్రారంభమైన ఈ సమావేశానికి ఏపీ నుంచి ఏడు శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత కేంద్ర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీ విభజన సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చ సాగుతోంది. 

కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి ఏనిమిదేళ్లు గడస్తున్న తెలంగాణ, ఏపీల మధ్య పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ విభజన వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.