Asianet News TeluguAsianet News Telugu

డిప్యూటీ సీఎం నారాయణస్వామి నుంచి ఆ శాఖ తొలగింపు.. బుగ్గనకు అదనపు బాధ్యతలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి నారాయణ స్వామి (Narayana Swamy) ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister ) పదవిలో ఉన్నారు. 

commercial taxes department Removal From AP Deputy cm Narayana swamy
Author
Amaravati, First Published Oct 31, 2021, 9:46 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి నారాయణ స్వామి (Narayana Swamy) ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister ) పదవిలో ఉన్నారు. అయితే తాజాగా ఆయన వద్దనున్న వాణిజ్య పన్నుల శాఖను ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం ఆయనను ఎక్సైజ్ శాఖకే పరిమతం చేసింది. ఆయన నుంచి తొలగించి వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి కేటాయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్థిక, ప్రణాళి, శాసనసభా వ్యవహారాలను చూస్తున్న బుగ్గన.. ఇకపై వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలను కూడా చూసుకోనున్నారు. 

చిత్తూరు జిల్లాకు చెందిన Narayana Swamy.. తొలుత కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. 2004 ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ఏర్పాటు తర్వాత నారాయణ స్వామి కాంగ్రెస్‌ను వీడి.. జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత గంగాధర నెల్లూరు(ఎస్సీ రిజర్వ్‌డ్) నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు. వైసీపీ సీనియర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడిగా ఉన్నారు. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా నారాయణస్వామికి పేరుంది. ఈ క్రమంలోనే 2019లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైఎస్ జగన్‌రెడ్డి.. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.  ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలు అప్పగించారు. 

Also read: పట్టాభితో బూతులు .. కుప్పంలో బాంబు డ్రామాలు, దేన్నీ జనం నమ్మలేదు: బాబుకి రోజా చురకలు

ఏపీలో భారీ మెజారిటీ అధికారం చేపట్టిన వైఎస్ జగన్.. మంత్రల పదవీకాలం రెండున్నరేళ్లనని గతంలోనే సీఎం జగన్ మంత్రులకు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్పులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్న నేపథ్యంలో.. ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మరోవైపు సిట్టింగులు మాత్రం టెన్షన్ పడుతున్నారు.

Also raed: కేసీఆర్ వ్యాఖ్యలకే స్పందించా, కొత్త పార్టీ ఎందుకు: రేవంత్ రెడ్డికి పేర్ని నాని కౌంటర్

ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్​ రెడ్డి గత నెలలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో త్వరలోనే భారీ మార్పులుంటాయని చెప్పారు. మంత్రివర్గంలో వంద శాతం కొత్తవారినే తీసుకుంటామని సీఎం చెప్పినట్టుగా తెలిపారు.. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios