2019 ఎన్నికలకు వైసీపీలో చేరిన కమెడియన్ అలీ.... తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి జగన్ గారితో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అలీ... మర్యాదపూర్వకంగా తమ నాయకుడిని కలిశానని చెప్పుకొచ్చారు. 

దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి నిలుస్తారని ఈ సందర్భంగా చెప్పారు నటుడు అలీ. కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీ ఎలా ఉందొ ముఖ్యమంత్రి వాకబు చేశారన్నారు. పరిస్థితులు ఎప్పటికి సాధారణ స్థితికి రావొచ్చన్న ముఖ్యమంత్రి ప్రశ్నకు... ఇండస్ట్రీలో ఇంకా సాధారణ పరిస్థితులు రావడానికి, షూటింగులు సాధారణంగా జరగడానికి సమయం పడుతుందని అలీ తెలిపానన్నారు. 

పిన్న వయసులోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారన్నారు అలీ. జగన్ మంచి చేస్తున్నపుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారని, వారు చేయలేక పోయారు కాబట్టి, జగన్ కి మంచి పేరు వచ్చేస్తుందన్న అక్కసుతో వారు విమర్శలు చేస్తున్నారని అలీ తెలిపారు. 

గత ఎన్నికల సందర్భంలో అలీ.... వైసీపీ అభ్యర్థుల తరుపున భారీ ఎత్తున ప్రచారం చేసారు. వైసీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఒక సాధారణ కార్యకర్తలా తనకు ఉన్న కొద్దీ సమయంలో కష్టపడ్డారు అలీ. 

ఇక సినిమా రంగం ఇంకా కూడా సంక్షోభ పరిస్థితినే ఎదుర్కొంటుంది. థియేటర్లు ఇప్పుడప్పుడు తెరుచుకునేలా కనబడడం లేదు. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ప్రస్తుతానికి ఇంకా కరోనా వైరస్ వల్ల ఇబ్బందికరంగానే ఉన్నాయి. షూటింగులు మునుపటిలా జరగడం లేదు.