అతను చేసేది అటెండర్ ఉద్యోగం.. జీతం రూ.5వేలు. అధికారికంగా మాత్రమే అతని జీతం రూ.5వేలు. కానీ అక్రమంగా అతను బాగానే సంపాదించాడు. ఎవరికీ తెలియకుండా కలెక్టర్ దగ్గర నుంచి దేవాదాయ శాఖ ఏసీ, తహసీల్దార్ అందరి సంతకాలు ఫోర్జరీ చేసి.. భారీగానే అక్రమాలు చేయాలని ప్లాన్ వేశాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం భగవాన్‌పురం గ్రామానికి చెందిన బెలమర ధర్మారావు టెక్కలి దేవదాయ శాఖ కార్యాలయంలో కంటింజెంట్‌ ప్రాతిపదికన 5 వేల రూపాయల వేతనానికి అటెండర్‌గా పనిచేస్తున్నాడు. 

నందిగాం, మెళియాపుట్టి ప్రాంతాల్లో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూముల విక్రయాలపై కన్నేసిన ధర్మారావు దీనికి పక్కాగా ప్లాన్‌ వేశాడు. కార్యాలయంలో ఉన్న పత్రాలను పోలిన కొన్ని రకాల డీ పట్టాలను సృష్టించాడు.

దీని పై కలెక్టర్‌ సంతకాలు, దేవదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ పేరుతో ఉన్న సీలు, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేసి కొంత మంది వ్యక్తులకు అమ్మేశాడు కూడా. వీటితో పాటు దేవదాయ శాఖలో కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి విజయవాడలో గల దేవదాయ కమిషనర్‌ పేరుతో నకి లీ పత్రాలను సృష్టించాడు. 

అయితే ధర్మారావు నకిలీ ప త్రాలు సృష్టించి వాటిని అమ్మకాలు చేశాడు తప్ప భూము లు చేతులు మారలేదు. దీంతో గత కొంత కాలంగా ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ధర్మారావు కార్యాలయానికి తరచూ గైర్హాజరు కావడంతో ఈఓకు అనుమానం వచ్చి పలుమార్లు హెచ్చరించడమే కాకుండా నోటీసులు జారీ చేశారు.

ఇదే సమయంలో కొంత మంది వ్యక్తులు ధర్మారావు కోసం తరచూ కార్యాలయానికి వస్తుండడంతో ఈఓ వీవీఎస్‌ నారాయణ తనదైన శైలిలో దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం బయట పడింది. దీంతో ఈఓతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ ఎన్‌.ఆదినారాయణ తదితరు లు హుటాహుటిన టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే ధర్మారావు 10 మంది వ్యక్తులకు పట్టాలను విక్రయించి సుమారు 1 ల క్షా 40 వేల రూ పాయలు వ సూలు చేసిన ట్లు ప్రాథమికంగా తేలింది. దేవదాయ అధికారులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.