Asianet News TeluguAsianet News Telugu

తోటి కోడళ్ల హత్య.. మామ, భర్తలే నిందితులు... చిన్న తప్పుతో ఎలా దొరికిపోయారంటే...

ఆంధ్రప్రదేశ్ లో జంట హత్యలు కలకలం రేపాయి. తోడి కోడళ్లిద్దరిని దారుణంగా హత్య చేశారు. అయితే ఘటనా స్థలంలో దొరికిన ఓ చెప్పు నిందితులను పట్టించేందుకు కీలకంగా మారింది. 

co sisters murder case in kurnool, police arrested three accused
Author
First Published Dec 16, 2022, 6:53 AM IST

కర్నూలు :  జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో బుధవారం దారుణమైన హత్యలు జరిగాయి. ఈ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఓర్వకల్లు మండలం నన్నూరులో తోడికోడళ్ళు హత్య జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ హత్యకేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు హత్యా స్థలంలో ఓ చెప్పు దొరికింది. దీని ఆధారంగానే  హత్య చేసిన నిందితులను పోలీసులు కనిపెట్టారు. వీరిని గురువారం అరెస్ట్ చేశారు ఈ మేరకు తెలిసిన వివరాల ప్రకారం.. నన్నూరుకు చెందిన రామేశ్వరి, రేణుక తోడికోడళ్ళు. వీరిద్దరూ ఒకేసారి హత్యకు గురయ్యారు. 

నన్నూరుకు చెందిన కురువ గోగన్న, మంగమ్మలకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పెద్ద రామగోవిందు, చిన్న కొడుకు చిన్న రామగోవిందు. వీరికి పెళ్లిళ్లు చేశాడు.పెద్ద రామ గోవిందుకు ఐదేళ్లక్రితం రామేశ్వరి తో పెళ్లయింది. చిన్న రామగోవిందుకు మూడేళ్ల క్రితం రేణుకతో పెళ్లయింది. అయితే వీరిద్దరికీ సంతానం లేదు. గోగన్నకు 30 ఎకరాల భూమి ఉంది. నేషనల్ హైవే దగ్గర  పది ఎకరాల పొలం ఉంది.  దాని విలువ ప్రస్తుతం కోట్లలో పలుకుతోంది. అయితే, కొడుకులిద్దరికీ పిల్లలు లేకపోవడంతో.. ఆస్తికి వారసులు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని గోగన్న భావించాడు. దీనికోసం కొడుకులకు మరో పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచన చేశాడు. రామేశ్వరి, రేణుకలను అడ్డు తొలగించుకుంటే కొడుకులకు రెండో పెళ్లి చేయవచ్చని అనుకున్నాడు.  ఇదే విషయాన్ని కొడుకులతో మాట్లాడాడు. దీంతో ముగ్గురు కలిసి ఇద్దరు కోడళ్ల హత్యకు పథకం పన్నినట్లు సమాచారం.

మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సమీక్ష.. సీడీపీవో పోస్టుల భర్తీకి ఆమోదం

గోగన్నకు కోడళ్ల మీద మరో అనుమానం కూడా ఉంది. వారిద్దరూ నాటు మందు పెట్టి తనను చంపాలని ప్రయత్నం చేశారని, చేతబడి చేశారని గోపన్నకు అనుమానం. తాను అనారోగ్యం బారిన పడడానికి వారిద్దరే కారణం అని నమ్మాడు. అనారోగ్యానికి చికిత్స కోసం నాటు వైద్యుడు దగ్గరికి వెడితే.. పసరు పోశాడు. అందులో మందు పడిందని.. అది కోడళ్లే పెట్టించి ఉంటారని చెప్పుకొచ్చాడు.  దీంతో ఇద్దరు కొడుకులతో కలిసి కోడళ్లను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో అంగీకరించాడు. అయితే ఇద్దరిని హతమార్చిన తర్వాత అక్కడినుంచి పారిపోతున్న సమయంలో చిన్న రామ గోవిందు కాలి చెప్పు అక్కడే పడిపోయింది. హత్య విషయం బయటకు వచ్చిన తర్వాత అక్కడ గుమిగూడిన స్థానికులు ఆ చెప్పు ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో అనుమానంతో తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  గురువారం డిఎస్పి వెంకటరామయ్య, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జంటహత్యలతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామేశ్వరి, రేణుకల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వందలాదిగా జనం హత్యా ప్రదేశానికి తరలివచ్చారు.  నిందితుల ఇంటిని ముట్టడించారు. మృతదేహాలను అదే ఇంట్లో పూడ్చి పెడతామని పట్టుబట్టారు.  వీరిని పోలీసులు నియంత్రించి, నచ్చజెప్పారు. నిందితుల పొలంలోనే అంత్యక్రియలు పూర్తి చేయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios