జూలై మూడోవారంలో మొదలవ్వనున్న పార్లమెంటు సమావేశాల్లోనే సీట్లపెంపుపై బిల్లు ప్రవేశపెట్టకపోతే భవిష్యత్తులో కష్టమేనని ఇద్దరు సిఎంలు భావిస్తున్నారు. అందుకనే భాజపా జాతీయ అధ్యక్షుడే అమిత్ షాతో పాటు ప్రధానిని కలిసి సీట్లపెంపుపై ఒత్తిడి తేవాలన్నది ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఒకవేళ వీరి ఒత్తిడి వ్యూహం పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో చూడాలి వీరిద్దరి అవస్తలు.
కేంద్రపై తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ప్రతీ విషయంలోనూ ఉప్పు-నిప్పు లాగుండే చంద్రబాబునాయుడు, కెసిఆర్ ఓ విషయంలో మాత్రం ఏకమవుతున్నారు. ఎందుకంటే ఆ ఒక్క విషయంతోనే రెండు పార్టీల భవిష్యత్తు ఆధారపడివుంది కాబట్టి. అదే..రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంచే విషయం. వచ్చే ఎన్నికలకల్లా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పి ఇతర పార్టీల్లోని ఎంఎల్ఏలను లాక్కున్నారు ఇద్దరు.
సీట్ల పెంపుపై ఇద్దరూ ఎన్ని ఒత్తిళ్ళు పెట్టినా కేంద్రంపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. సీట్ల పెంపుపై ప్రధానమంత్రి నరేంద్రమోడినే పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే, సీట్ల పెంపు వల్ల అధికారంలో ఉన్న టిఆర్ఎస్, టిడిపిలకే ఉపయోగం తప్ప రెండు రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం ఉపయోగం లేదని భాజపా నేతలు పదే పదే చెప్పారు. దాంతో జాతీయ నాయకత్వం కూడా భాజపా నేతల వాదనతో ఏకీభవించింది.
ఒకపుడు సీట్ల విషయమై ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అండగా ఉండేవారు. సీట్లపెంపు సాధ్యం కాదని పార్లమెంటులో కేంద్రమంత్రులు ఎప్పుడు ప్రకటించినా వెంటనే వెంకయ్య సదరు ప్రకటనకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తుండేవారు. అయితే, ఇటీవల వెంకయ్య సీట్లపెంపు విషయానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దాంతో ప్రత్యక్ష్యంగా సీట్లపెంపుపై వెంకయ్య నుండి ముఖ్యమంత్రులిద్దరికీ సహకారం అనుమానమే.
అందుకనే ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో కలిసినపుడు సీట్లపెంపుపై మాట్లాడుకున్నారట. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఢిల్లీలో చంద్రబాబు, కెసిఆర్ కలిసారు కదా? అదే సమయంలో సీట్లపెంపుపై ముచ్చట్లాడుకున్నారట. సీట్లపెంపు గనుక జరగకపోతే తమకెదురయ్యే ఇబ్బందులపై చర్చించుకున్నారట. అందుకనే ఈ విషయంలో ఇద్దరూ కలిసే కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారట.

.