సోమవారం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్‌తో సీఎం తొలిసారి ప్రత్యేకంగా సమావేశం కానుండటంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
రేపు సాయంత్రం ఏపీ హైకోర్టు (ap high court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రాతో (justice pk mishra) సీఎం జగన్ (ys jagan) భేటీ కానున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్‌లో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు సీజేను జగన్ కలవనున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్‌తో సీఎం తొలిసారి ప్రత్యేకంగా సమావేశం కానుండటంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (justice nv ramana) వచ్చినప్పుడు మాత్రమే హైకోర్టు సీజేఐ, ఇతర న్యాయమూర్తులను జగన్ కలిశారు. ప్రత్యేకించి సీఎం, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంత వరకు భేటీ కాలేదు. కర్నూలును (kurnool) న్యాయ రాజధాని చేయాలని భావిస్తోన్న జగన్.. హైకోర్టు తరలింపుకు సంబంధించి సీజేఐతో చర్చించే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.
