Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు

దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 (Covid new variant JN.1) వ్యాప్తి నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

CM YS Jagan's review on Covid new variant JN.1. Key instructions for officials..ISR
Author
First Published Dec 22, 2023, 4:03 PM IST

కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 వేరియంట్ పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ జేఎన్.1 వేరియంట్ పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు సూచించారు. ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండానే ఈ కోవిడ్‌ వేరియంట్‌ సోకినవారు రికవరీ అవుతున్నారని చెప్పారు. హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వెల్లడించారు.

చలికి వణుకుతున్న ఉత్తర తెలంగాణ.. గిన్నెధరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు..

డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు దీనికి లేవని  అధికారులు చెప్పారు. అయితే జేఎన్‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని తెలిపారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ హాస్పిటల్ లో పరీక్షలు చేస్తున్నామని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు.

గోకుల్‌ చాట్ ఓనర్ ముకుంద్‌దాస్‌ కన్నుమూత..

గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నామని అధికారులు సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. దీంతో పాటు హాస్పిటల్స్ లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైన అన్ని రకాల మందులూ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నామని చెప్పారు. పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాని తెలిపారు. అలాగే ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి–టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధం చేశామని చెప్పారు. 56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

పాకిస్థాన్ లో భూకంపం.. ఇస్లామాబాద్, రావల్పిండిలో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

ముందస్తు చర్యలపై దృష్టి సారించాలి..- సీఎం జగన్
ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ వేరియంట్ వ్యాప్తి చెందితే ఎదుర్కోవడానికి ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను ముందస్తు చర్యల కోసం అలర్ట్‌ చేయాలని సూచించారు. కొత్త వేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ ఉద్యోగులకు అవగాహన కల్పించాలని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios