వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి: కరోనాపై ఏపీ సీఎం జగన్ ఆదేశం


కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. రానున్న రెండు మాసాల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ప్రజలు గుమికూడకుండా చూడాలని ఆయన కోరారు.

CM YS Jagan reviews on Corona in Andhrapradesh lns

అమరావతి:  రానున్న రెండు మాసాల పాటు  అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను కోరారు.  కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.రాష్ట్రంలోని ప్రతి ఇంటింటి సర్వే కొనసాగాలని సీఎం కోరారు. జ్వర లక్షణాలున్నవారికి పరీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

45 ఏళ్లుపైబడినవారు గర్భవతులు, టీచర్లకు వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.విలేజ్ క్లినిక్స్ ను పీహెచ్‌సీలతో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా అనుసంధానించాలని ఆయన ఆదేశించారు. డిసెంబర్ నాటికి విలేజ్ క్లినిక్స్ అన్ని పూర్తి చేయాల్సిందిగా కోరారు.కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. పెద్ద ఎత్తున జనం గుమికూడకుండా చూడాల్సిందిగా కోరారు.మతపరమైన కార్యక్రమాల్లో కరోనా  నిబంధనలు అమలు చేయాలన్నారు. అయితే . దీనిపై మార్గదర్శకాలు విడుదల చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios