Asianet News TeluguAsianet News Telugu

నన్ను వెలివేశారంటూ చిన్నారి లేఖ.. స్పందించిన సీఎం జగన్

తమను వెలివేశారని... స్కూల్లో కూడా ఎవరూ తనతో మాట్లాడటం లేదని ఆ చిన్నారి లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో స్కూల్లో  ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

CM YS Jagan response on girl student letter in prakasham
Author
Hyderabad, First Published Sep 14, 2019, 1:43 PM IST

తనకు సహాయం చేయాలని కోరుతూ ఓ చిన్నారి రాసిన లేఖ రాసిందంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్  జగన్ స్పందించారు. ఆ చిన్నారి సమస్య గురించి పూర్తిగా తెలుసుకొని  వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.... ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి.

తమను వెలివేశారని... స్కూల్లో కూడా ఎవరూ తనతో మాట్లాడటం లేదని ఆ చిన్నారి లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో స్కూల్లో  ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిన్నారి గురించి వచ్చిన వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి విషయం గురించి ఆరా తీశారు. వెంటనే గ్రామాన్ని సందర్శించి వివరాలు కనుక్కొని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios