భోరున ఏడ్చిన చంద్రబాబు నాయుడు.. అప్పుడు నేను సభలో లేనన్న ముఖ్యమంత్రి జగన్...
కౌన్సిల్ చైర్మన్ గా వైఎస్ఆర్ సీపీకి చెందిన దళితుడు రాబోతున్నారని, ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు స్టేషన్ లోకి వెళ్లిపోయారని, ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదని జగన్ అన్నారు. సంబంధం లేని టాపిక్ ను చంద్రబాబు సభలోకి తీసుకువస్తారని, సభలో వాతావరణాన్ని చంద్రబాబే రెచ్చగొడతారని సీఎం ఆరోపించారు.
అమరావతి : శాసనసభలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుటుంబం మీద వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి Jaganmohan Reddy స్పందించారు. ఆ సమయంలో తాను సభలో లేనని, సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్ష చేశానని తెలిపారు. సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో తెలుసుకున్నాను అన్నారు. తాను సభలోకి వచ్చేసరికి Chandrababu ఎమోషనల్ గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు పొలిటికల్ అజెండానే ముఖ్యమన్నారు. మండలిలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయిందని, మండలిలో వైఎస్ఆర్ సిపి బలం గణనీయంగా పెరిగింది అన్నారు.
కౌన్సిల్ చైర్మన్ గా వైఎస్ఆర్ సీపీకి చెందిన దళితుడు రాబోతున్నారని, ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు స్టేషన్ లోకి వెళ్లిపోయారని, ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదని జగన్ అన్నారు. సంబంధం లేని టాపిక్ ను చంద్రబాబు సభలోకి తీసుకువస్తారని, సభలో వాతావరణాన్ని చంద్రబాబే రెచ్చగొడతారని సీఎం ఆరోపించారు.
సహజంగానే దానికి స్పందిస్తూ అధికారపక్షం నుంచి మాట్లాడతారని వివరించారు. చంద్రబాబు చెప్తున్నట్టుగా అలాంటి మాటలేవి అధికారపక్షం నుంచి మాట్లాడలేదన్నారు. TDP ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా.. ఆనాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన్ రంగ హత్య, మాధవ రెడ్డి హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ కూడా చర్చ జరగాలని అధికార పార్టీ సభ్యులు అన్నారన్నారు. చంద్రబాబు రెచ్చగొడుతున్నారు కాబట్టే ఈ మాటలు అన్నారని జగన్ పేర్కొన్నారు.
Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం
ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడలేదు అన్నారు. కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు మాట్లాడతారు తప్ప.. ఇంకెవ్వరూ మాట్లాడలేదన్నారు. మా చిన్నాన్న, అమ్మ, చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారు. అధికారపక్షం నుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదన్నారు. సభ రికార్డులు చూసినా ఇది అర్థమవుతుందన్నారు. వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ చంద్రబాబు శబ్దాలు చేశారని, ఇవన్నీ మన కళ్ళ ముందే చూశామన్నారు. అవన్నీ దేవుడు చూస్తాడని జగన్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై Chandrababu Naidu తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు.
తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. నేడు జరిగిన ఘటనపై ఎం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. తన పాలన కాలంలో ఎన్నో రికార్డులు సృష్టించానని.. తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో తెల్చకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. ‘