ఇదే ప్రాంగణంలోని డోర్ నెంబర్ 12-353/2/5 లోని మరో భవనానికీ 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాలకు ఆస్తి పన్నును మంగళగిరి- తాడేపల్లి నగర పాలక సంస్థకు జమ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన ఇంటి, కార్యాలయ ఇంటి పన్నును ఫైన్ తో సహా చెల్లించారు. తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి, ఆయన కార్యాలయానికి మూడేళ్లకు రూ.16,90,389 ఆస్తి పన్నును శుక్రవారం చెల్లించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వార్డు నంబర్ 12లో గల ఆంధ్రరత్న కట్ట వద్ద పార్సివిల్లే-47లోని డోరు నంబర్ 12-353/2/2 లో భవానానికీ, ఇదే ప్రాంగణంలోని డోర్ నెంబర్ 12-353/2/5 లోని మరో భవనానికీ 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాలకు ఆస్తి పన్నును మంగళగిరి- తాడేపల్లి నగర పాలక సంస్థకు జమ చేశారు.
ఈ రెండు భవనాలూ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి పేరుతో ఉన్నాయి. మొదటి భవనానికీ అపరాధ రుసుముతో కలిపి రూ.16,19,649, రెండో భవనానికీ అపరాధ రుసుములతో కలిసి రూ.70,740 చొప్పున చెల్లించారు.
