కాకినాడ డీఆర్సీ గొడవపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద పంచాయితీ ముగిసింది. బహిరంగ వేదికల వద్ద పరస్పరం విమర్శలు చేసుకోవద్దని జగన్ .. పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖర్‌లకు సూచించారు.
కాకినాడ డీఆర్సీ గొడవపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద పంచాయితీ ముగిసింది. బహిరంగ వేదికల వద్ద పరస్పరం విమర్శలు చేసుకోవద్దని జగన్ .. పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖర్‌లకు సూచించారు.
సీఎంతో భేటీ అనంతరం ఎంపీ పిల్లి మాట్లాడుతూ.. కాకినాడ డీఆర్సీ సమావేశంలో గొడవ టీ కప్పులో తుఫాను వంటిదన్నారు. ఆవేశంలో వివాదాలు రావడం సహజమేనని అన్నారు.
తనను, ద్వారంపూడిని కూర్చోబెట్టి జగన్ మాట్లాడారని... మేడలైన్ లాండ్ కన్వర్షన్ టీడీపీ హయాంలో జరిగిందన్నారు. ఉప్పుటేరు పక్కనే వున్న మేడలైన్ అనే భూములు.. 900 ఎకరాలు ఉంటాయని పిల్లి చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో డీఆర్‌సీ సమావేశం రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకరిని మరొకరు తిట్టుకుంటూ గందరగోళం సృష్టించారు.
టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఈ విషయం పార్టీ అధిష్టానం దాకా వెళ్లడంతో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే ఇద్దరు తన వద్దకు రావాల్సిందిగా ఆదేశించడంతో బుధవారం ద్వారంపూడి, పిల్లి సుభాష్‌లు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
