Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం: తూ.గోలో బయో ఇథనాల్ ప్లాంట్ కి జగన్ భూమి పూజ

తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు  పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
 

CM YS Jagan  lays foundation for ethanol plant
Author
First Published Nov 4, 2022, 12:27 PM IST

కాకినాడ: తమ ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాలతో  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని ఏపీ  సీఎం  వైఎస్ జగన్  చెప్పారు.తూర్పు గోదావరి  జిల్లాలోని గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో   శుక్రవారంనాడు అసాగో బయో ఇథనాల్  ప్లాంట్ కు సీఎం  జగన్  భూమి  పూజ  చేశారు. రూ.270  కోట్లతో ఆసాగో  బయో ఇథనాల్  ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.20 ఎకరాల్లో ఈ ప్లాంట్ ను నిర్మించనున్నారు.2024  నాటికి ఉత్పత్తి ప్రారంభమయ్యేలా కంపెనీ యాజమాన్యం ప్లాన్ చేసింది.నూకలు ,చెరకు, వేరుశనగ,జొన్న నుండి ఇథనాల్ ను ఉత్పత్తి చేయనున్నారు.కోటి లీటర్ల ఇథనాల్ వినియోగంతో 20 వేల  టన్నుల కర్భన ఉద్గారాలుతగ్గుతాయి. ఈ ప్లాంట్  నిర్మాణంతో 500 మందికి ఉపాధి  లభ్యం కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  సీఎం జగన్   ప్రసంగించారు.దేవుడి దయతో  మంచి కార్యక్రమానికి  శ్రీకారం  చుట్టామన్నారు.ఈ  ప్రాంతానికి మంచి చేసే  ప్లాంట్ రానుందని సీఎం  జగన్  అభిప్రాయపడ్డారు.ఆరు నెలల  కాలంలోనే ఈ ప్లాంట్ కు సంబంధించిన  అన్నీ అనుమతులను మంజూరు చేశామని  సీఎం జగన్ గుర్తు చేశారు.2లక్షల లీటర్ల సామర్ధ్యంతో  ప్లాంట్ నిర్మిస్తున్నట్టుగా సీఎం వివరించారు.ఈ  ప్లాంట్ నిర్మాణంతో స్థానికులకు ఉపాధి కూడ దక్కుతందని ఆయన చెప్పారు.రాష్ట్రంలో పరిశ్రమలు  ఏర్పాటు  చేసేందుకు మంచి వాతావరణం  ఉందని  సీఎం  జగన్  గుర్తు చేశారు. రాష్ట్ర  ప్రభుత్వం అనుసరిస్తున్నపారిశ్రామిక విధానంతో పెట్టుబడులు  పెట్టేందుకుపారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని  ఆయన  చెప్పారు.ఈ ప్లాంట్  కారణంగా రంగు మారిన ధాన్యానికి కూడ మంచి ధర రానుందని సీఎం జగన్ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios