Asianet News TeluguAsianet News Telugu

కరోనా రోగుల నుండి అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు: సీఎం జగన్ ఆదేశం

కరోనా రోగులకు చికిత్సను అధిక రేట్లపై చేయడంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

CM YS Jagan furious at Covid hospitals for charging excess fee, directs collectors to monitor
Author
Amaravathi, First Published Aug 25, 2020, 6:06 PM IST

అమరావతి: కరోనా రోగులకు చికిత్సను అధిక రేట్లపై చేయడంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

also read:గుండు కొట్టించడం తప్పు: దళితులపై దాడులు, ఇసుక, అక్రమ మద్యంపై జగన్ కీలక వ్యాఖ్యలు

మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవిడ్ రోగులకు చికిత్సల కోసం ప్రభుత్వం నిర్ధేశించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపాలని ఆయన సూచించారు.

కరోనా బాధితులకు అరగంటలో బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఆయన చెప్పారు. 104, 14410 కాల్ సెంటర్లకు వచ్చే కాల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని  సీఎం అధికారులను కోరారు. 

కోవిడ్ ఆసుపత్రుల్లో సేవలు నాణ్యంగా ఉండాలని ఆయన సూచించారు. అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలన్నారు. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలను నిరోధించే పరికరాలు ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios