ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో రేపు మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరగబోయే సమావేశంలో వీరు పాల్గొననున్నారు.

పార్లమెంట్ వ్యవహారాలు ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి... అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన ఆయా పార్టీలకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి జగన్‌, టీఆర్ఎస్  నుంచి కేటీఆర్‌ వెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయంలో టీడీపీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని సమాచారం.