విజయవాడకు చెందిన లక్కపోగు కోటమ్మకు వచ్చిన సీఎం సహాయ నిధి చెక్ బౌన్స్ అయ్యింది. సీఎం సహాయనిధి నుంచి తనకు వచ్చిన చెక్ ను బ్యాంకులో విత్ డ్రా చేసుకుందామని వెళ్లిన ఆమెకు నిరాశే ఎదురయ్యింది. చెక్ బౌన్స్ అయ్యిందని ఆ చెక్ ని ఆమెకు బ్యాంకు అధికారులు తిరిగి ఇచ్చారు.

ఆ చెక్ లో ఉన్న వివరాల ప్రకారం.. కోటమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.30వేలు చెక్ ద్వారా అందజేశారు. ఆమె ఎకౌంట్ నెంబర్ 476010200001166. కాగా.. ఆ చెక్ ని నరసారావుపేట యాక్సిస్ బ్యాంక్ లో ఫిబ్రవరి 22వ తేదీన  డిపాజిట్ చేసింది. కాగా.. ఫిబ్రవరి 25వ తేదీ నాటికి చెక్ బౌన్స్ అయ్యింటూ అధికారులు ఆమెకు చెప్పారు. దీంతో బాధితురాలకు షాక్ అయ్యింది.


అయితే.. ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సీఎం సహాయ నిధిలో కనీసం రూ.30వేలు కూడా లేవా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.